PUBLIC SPEAKING SERIES – PART 1
మాటల శక్తి ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?
మాటలు చాలా సాధారణంగా అనిపించవచ్చు.
కానీ ఒక మంచి మాట ఒక మనిషి జీవితాన్ని మార్చగలదు.
ఒక మంచి ప్రసంగం వేల మందిని ప్రేరేపించగలదు.
అందుకే చరిత్రలో గొప్ప నాయకులు మాటల శక్తిని ఉపయోగించారు.
మాటలతో మారిన చరిత్ర
స్వామి వివేకానందుడు చికాగో సభలో చేసిన ప్రసంగం ప్రపంచాన్ని ఆకట్టుకుంది.
మహాత్మా గాంధీ తన మాటలతో లక్షల మందిని స్వాతంత్ర్య ఉద్యమంలో కలిపాడు.
డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం తన మాటలతో యువతలో స్వప్నాలను నింపాడు.
ఇది అన్నీ ఒకే విషయం చెబుతున్నాయి.
మాటలకు అపారమైన శక్తి ఉంది.
మీరు కూడా మంచి స్పీకర్ కావచ్చు
చాలా మంది ఇలా అనుకుంటారు.
"నాకు మాట్లాడటం రాదు."
"నేను స్టేజ్ పై భయపడుతాను."
కానీ నిజం ఏమిటంటే ప్రతి గొప్ప స్పీకర్ కూడా ఒకప్పుడు ప్రారంభ స్థాయిలోనే ఉన్నాడు.
practice, patience, confidence ఉంటే ఎవరైనా గొప్ప స్పీకర్ కావచ్చు.
మీ మాటలు మీ భవిష్యత్తును నిర్మిస్తాయి.
కాబట్టి మాట్లాడే కళను ఇప్పటి నుంచే నేర్చుకోవడం ప్రారంభించండి.
Shaktimatha Learning
జ్ఞానం పంచుకుంటే — మనస్సులు మారుతాయి.
No comments:
Post a Comment